బీఎండబ్ల్యూ కారు ట్రయల్ రైడ్ చేయాలనుకున్న కోరిక ఓ వ్యక్తి కొంప ముంచింది. మరో ఇద్దరు చిన్నారుల మరణానికి కారణమైంది. ఈ నెల 10న ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం…
వ్యాపార వేత్త సాహిల్ నారంగ్ (27) ఢిల్లీలోని నిర్మాణ్ విహార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. నోయిడాలో నారంగ్ కు ఓ వస్త్రాల తయారీ కంపెనీ ఉంది. ఇటీవల తన మామకారులో అతనితో పాటు కలిసి నారంగ్ విమానాశ్రయం నుంచి ఇంటికి బయలు దేరారు.
ఆ నూతన మోడల్ కారును నారంగ్ మామ ఇటీవలే కొన్నాడు. దీంతో కారు వేగం, దాని పనితీరును టెస్ చేయాలని అనుకున్నాడు. వెంటనే కారును నారంగ్ వేగంగా డ్రైవ్ చేయడం మొదలు పెట్టాడు.
ఈ క్రమంలో ఫ్లై ఓవర్ పై వెళుతుండగా వ్యాగన్ ఆర్ ను బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టింది. దీంతో వ్యాగన్ ఆర్ గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ కింద ప్లాట్ ఫారమ్ పై నిద్రిస్తున్న వారిపై పడింది.
దీంతో ఫ్లై ఓవర్ పై నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు. వీరితో పాటు మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆ సమయంలో సీసీ కెమెరాలు పనిచేయలేదని, గాయపడిన వారు తప్ప మరెవరూ బీఎండబ్ల్యూను గుర్తు పట్టకలేకపోయారని పోలీసులు తెలిపారు. దీంతో సీసీటీవీ మ్యాపింగ్ ను ఉపయోగించి సుమారు 120 కెమెరాల ఇమేజ్ లను విశ్లేషించి కారును ఐడెంటిఫై చేసినట్టు పోలీసులు వెల్లడించారు.