గత ఏడాది మన దేశంలో అడుగుపెట్టిన కరోనా మహమ్మారి నష్టం నుంచి ఇంకా మన దేశం బయటకు రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మరోఆరి కంగారు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మరోసారి ఉద్దీపన ప్యాకేజీలు అందించే అవకాశం కనపడుతుంది. ఇక దేశంలో లాక్ డౌన్ కూడా విధించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దీని మీద కసరత్తు చేస్తున్నాయని అంటున్నారు.
ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలో కరోనావైరస్ కేసులు పెరగడం అరుదైన మాంద్యం నుండి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి విఘాతంగా మారుతుందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుత వేవ్ ని కట్టడి చేయడంలో విఫలం అయితే… కరోనా కారణంగా తమ ఉద్యోగాలను కోల్పోయిన లక్షలాది మంది తిరిగి ఉద్యోగాలు పొందడంలో జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.
డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రాతా పాట్రా నేతృత్వంలోని బ్యాంకర్లు కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు చాలా వేగంగావృద్దిని సాధించడానికి అనుకూలంగా పరిస్థితి ఉంది. అనుకూల పవనాలు వేస్తున్నాయి. వ్యక్తిగత సంరక్షణ, వినోదం మరియు ఆతిథ్య సేకరణ వంటివి సేవలు ఇప్పుడు మన దేశంలో తిరిగి పుంజుకుంటున్నాయి అని, ఈ పరిస్థితిలో ఇలా కరోనా రావడం అనేది దారుణంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నెలవారీ బులెటిన్ లో పేర్కొన్నారు.
లాక్ డౌన్ తో నియంత్రణలు భరించలేనివిగా ఉంటాయని పేర్కొంది. కేసులు పెరుగుతూ ఉంటే అది ఆర్థిక వ్యవస్థకు నష్టం తెస్తుందని… ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో వృద్ధిపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఆర్బిఐ అంచనాతో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ఈ ఆర్ధిక సంవత్సరానికి 25.5 శాతం తక్కువ వాస్తవ జిడిపి వృద్ధి అంచనాను అంచనా వేస్తున్నామని వెల్లడించారు. ముంబైలోని బార్క్లేస్ పిఎల్‌సిలో సీనియర్ ఇండియా ఎకనామిస్ట్ రాహుల్ బజోరియా మాట్లాడుతూ ప్రస్తుత ఆంక్షలు రెండు నెలలు అమలులో ఉంటే, అది వచ్చే ఏడాది నామమాత్రపు జిడిపి వృద్ధి అంచనా 11 శాతం నుండి 0.17 శాతం పాయింట్లను తగ్గిస్తుందని అన్నారు. థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కించిన ప్రకారం భారతదేశ నిరుద్యోగిత రేటు ఫిబ్రవరిలో 6.9 శాతానికి పెరిగింది, జనవరిలో 6.5 శాతంగా ఉంది.