మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సమీపంలో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది.
గురువారం తెల్లవారుజామున 4.53 గంటల సమయంలో ఇండోర్‌లో భూమి కంపించినట్టు అక్కడి ప్రజలు చెప్తున్నారు.
ఇండోర్‌కు 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని పేర్కొన్నది.
కాగా.. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు ఇంతవరకూ తెలియలేదని.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.