సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. పొత్తి కడుపులో సమస్యగా అనిపించడంతో సీఎం ఆస్పత్రికి వచ్చారని వైద్యులు తెలిపారు.
కేసీఆర్‌కు గ్యాస్ట్రిక్ సంబంధిత పరీక్షలు నిర్వహించినట్టు ఏఐజీ గ్యాస్ట్రో విభాగాధిపతి డి. నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఆయనకు కడుపులో చిన్న పాటి అల్సర్ ఉన్నట్టు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రికి సీఎం వెంట ఆయన సతీమణి శోభ, కూతురు కవిత, మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఇతర మంత్రులు వెళ్లారు. సుమారు ఏడుగంటల తర్వాత ఆస్పత్రి నుంచి కేసీఆర్ ప్రగతి భవన్ వెళ్లిపోయారు.
గతంలోనూ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు ఆయన్ని అధికారులు సోమాజీగూడ యశోధ ఆస్పత్రికి తరలించారు. అన్ని పరీక్షల నిర్వహించిన అనంతరం వెన్ను ముకలో కొంచెం సమస్య వున్నట్టు గుర్తించామని వైద్యులు వెల్లడించారు.
సీఎం ఎక్కువగా పుస్తకాలు చదవడం, ఐప్యాడ్ చూస్తుండడం వంటి కారణాల వల్ల వెన్నెముకపై బాగా ఒత్తిడి పెరిగి వుంటుందని వైద్యలు తెలిపారు. అలాంటి సమయంలో సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యలు వచ్చి ఎడమ చేతికి నొప్పి వస్తుందని పేర్కొన్నారు.