ప్రజలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కాస్త కుదుటపినట్టు కనిస్తోంది. దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కాస్త ఊరట కలిగనట్టే అనిపించినప్పటికీ.. మహమ్మారితో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా రిపోర్ట్ లో వెల్లడించింది.
దేశంలో 67,084 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ లో పేర్కొంది. అలాగే.. 1,67,882 మంది కోలుకున్నారని పేర్కొంది. నమోదైన కరోనా కేసులతో పాటు.. 1,241 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది.
దేశంలో ప్రస్తుతం 7,90,789 మంది కరోనాకు ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. మృతుల సంఖ్య మొత్తం 5,06,520కి చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉందని పేర్కొంది.
ఇప్పటి వరకు మొత్తం 171,28,19,947 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించామని అధికారులు వెల్లడించారు. కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. ప్రజలకు కరోనాతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.