రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నారు. అలియా భట్, అజయ్ దేవగన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మొదట సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ అది వీలు పడలేదు. ఇప్పుడు మార్చి 25న డేట్ ఫిక్స్ చేశారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే మాస్, క్లాస్ ఇలా అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలామంది చాలాసార్లు ఈ ట్రైలర్ ను చూసే ఉంటారు. అయితే తాజాగా చూసిన టైలర్ లో చిన్న మార్పులు చేశారు మేకర్స్.
అది ఏంటంటే జనవరి 7న రిలీజ్ డేట్ అని ఉన్న ప్లేస్ లో కొత్త డేట్ మార్చ్ 25 ను పెట్టారు. ఇక కొత్తగా చూసిన వారంతా కూడా ఇది ఎప్పుడు ఎడిట్ చేశారనే ఆశ్చర్యం పోక తప్పదు.