కావేరి నది పరిరక్షణకు చక్కని గీతం ఆవిష్కారమైంది. సేవ్ కావేరి పేరుతో సద్గురు జగ్గీ వాసుదేవ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించగా సినీతారల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్, బాలీవుడ్ నటులు కావేరి నదిని పరిరక్షించాలని ప్రచారం చేస్తున్నారు.
వీరికి తోడుగా నేను సైతం అంటూ ప్రముఖ గాయని స్మిత గొంతు కలిపారు. కావేరి పిలుస్తోంది కదలి రా..తల్లి దేవేరి పిలుస్తోంది తరలి రా…అంటూ కొత్త గీతంతో ప్రచారం మొదలెట్టారు.
పాల లాంటి నీరిచ్చే పచ్చి బాలింత రా..మోకాళ్ళ మీద నిలబడింది నేడు నేల ముందర అంటూ హృద్యంగా స్మిత గానం చేసింది. కన్నడిగుల కడుపు నింపే అమ్మ…తమిళుల దాహార్తి తీర్చిన ఏరమ్మ…అంటూ మూగబోతున్న కావేరి కష్టాన్ని తీర్చాలని పాటలో స్ఫూర్తి నిచ్చింది. ఈ స్ఫూర్తిదాయక కావేరి జీతాన్ని అనంత్ శ్రీరామ్ రచించగా ఎం.జి.గోఖరే సంగీతం అందించారు.