స్పైస్ జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానం ఆకాశంలో ఉండగా పొగలు కమ్మేసాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తొలి వెలుగుతో మాట్లాడిన ప్రయాణికులు స్పైస్ జెట్ నిర్లక్ష్యాన్ని వివరించారు.
ప్రయాణికులు చెప్పిన వివరాల ప్రకారం.. గోవా నుంచి హైదరాబాద్ వస్తోంది స్పైస్ జెట్ ఎస్ జి 3735 విమానం. అయితే, నాగ్ పూర్ నుంచి విమానంలో పొగ వ్యాపించింది. విమానం మొత్తం కమ్మేసింది.
అయితే, సిబ్బంది అడుగడునా నిర్లక్ష్యం వహించారు. నాగ్ పూర్ లో పొగలు గుర్తించినా అలాగే హైదరాబాద్ తీసుకొచ్చారు. పొగతోనే 20 నిమిషాలపాటు ప్రయాణం చేసి ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్ వే చివరలో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఆక్సిజన్ మాస్కులు కూడా సరిగ్గా పని చేయలేదని ప్రయాణికులు తెలిపారు. అత్యవసర సేవలు దాదాపు అరగంట తరువాత వచ్చాయి. 96 మంది ప్రయాణికులు.. 20 నిమిషాలకు పైగా వానలోనే నిలబడ్డారు.