BCCI కాంట్రాక్ట్ లిస్ట్ లో మేల్ క్రికెటర్లకు 7 కోట్లు, ఫిమేల్ క్రికెటర్లకు 50 లక్షలు ఇస్తారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ …ఈ విషయంపై స్పందించిన ఉమెన్ క్రికెట్ టీమ్ సభ్యురాలు స్మృతి…దీంట్లో పెద్ద తప్పేమీ లేదంది.
ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే….మాకు వచ్చే ఆ డబ్బు కూడా మెన్స్ క్రికెట్ టీమ్ కారణంగానే వస్తుంది…..ప్రస్తుత సమయంలో మేము ఆటమీద దృష్టి పెట్టాలే కానీ వచ్చే డబ్బు మీద కాదంది.., ఉమెన్స్ క్రికెట్ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుందని..ఇంకొన్ని రోజుల్లో మెన్స్ క్రికెట్ కు సమానమైన స్థాయికి వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు?
ఆ తేడా ఎందుకు?
1) ఆటలో మజా
మేల్ క్రికెట్ తో పోల్చితే ఫిమేల్ క్రికెట్ లో ఆ కిక్ ఉండదు. దానికి కారణం గ్రౌండ్ బయటపడే సిక్సులు ఉండవు, 130+ స్పీడ్ తో వచ్చే బంతులుండవు…ఆట చప్పగా సాగుతుంది.
2) ఆడియన్స్
మెన్స్ క్రికెట్ తో పోల్చితే ఉమెన్స్ క్రికెట్ ను ఫాలో అయ్యే ఆడియన్స్ చాలా తక్కువగా ఉంటారు.
3) స్టార్ ప్లేయర్ల కొరత:
ఇన్ని సంవత్సరాల నుండి ఉమెన్స్ క్రికెట్ ఆడుతున్నా…..వారిలో స్టార్ ప్లేయర్ సంఖ్య చాలా తక్కువ!