స్మృతిఇరానీ కుమార్తె గోవాలో నకిలీ లైసెన్సుతో బార్ నడుపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల గురించి తెలిసిన విషయమే. దీని పై స్పందించిన స్మృతి న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. తన కుమార్తెపై చేసిన ఆరోపణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని.. ఈ క్రమంలోనే బేషరతుగా రాతపూర్వక క్షమాపణలు చెప్పాలంటూ ముగ్గురు నేతలకు, కాంగ్రెస్ పార్టీకి లీగల్ నోటీసు పంపారు.
ఇందులో పవన్ ఖేడా, జైరాం రమేష్, నెట్టా డిసౌజాలు ఉన్నారు. ‘మంత్రిగా, ప్రజాజీవితంలోని వ్యక్తిగా ఉన్న మా క్లయింట్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, ఆమెతోపాటు ఆమె కుమార్తెను అగౌరవపరిచేందుకు తప్పుడు ఆరోపణలు చేశారు’ అని నోటీసులో పేర్కొన్నారు. మంత్రి కుమార్తెకు గోవాలో బార్ నిర్వహణలో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుటుంబంపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయని, మంత్రి కుమార్తె గోవాలో నడుపుతున్న రెస్టారంట్‌లో నకిలీ లైసెన్సుతో బార్ నడుపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేడా ఆరోపించారు. అయితే, తన క్లయింట్ ఎలాంటి రెస్టారంట్‌ను నడపడం లేదని, దానికి ఆమె యజమాని కాదని స్మృతి కుమార్తె తరఫు న్యాయవాది ఇప్పటికే స్పష్టం చేశారు.
అలాగే అధికారుల నుంచి ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. మంత్రి సైతం.. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ తప్పుడు ఆరోపణలపై కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పారు. ఈ మేరకు తాజాగా లీగల్ నోటీసులు పంపారు.
ఆమెనే క్షమాపణలు చెప్పాలి…..
తన కుమార్తె పై చేసిన నిరాధారమైన,తప్పుడు ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్,పవన్ ఖేరాలకు కేంద్ర మంత్రి లీగల్ నోటిసులు పంపిన తర్వాత వాటిపై కాంగ్రెస్ నాయకులు స్పందించారు. బార్ కు సంబంధించిన లైసెన్సులను వారు తారుమారు చేశారని ఆరోపించారు. దీనికి గానూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీనే తమకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
నోటీసులు అందుకున్న కాంగ్రెస్ నాయకులు దీనికి కచ్చితంగా సమాధానం చెప్పి తీరుతారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ స్మృతి పై విరుచుకుపడ్డారు. ఆమె క్షమాపణ చెప్పాలి అని ఆమె డిమాండ్ చేశారు.
ఆమె కూతురు రెస్టారెంట్ నడుపుతుందనడానికి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మాపై పరువు నష్టం కేసులు పెట్టే బదులు ఆమె లైసెన్సులు తారుమారు చేసినందుకు దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
For what ? There is ample proof that her daughter was running the restaurant. Instead of filing defamation cases against @INCIndia leaders , @smritiirani should apologize to the nation for allegedly manipulating the licenses ! https://t.co/z38MNP4AEC
— Dr. Shama Mohamed (@drshamamohd) July 24, 2022
Advertisements