కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ నడుపుతున్న రెస్టారెంట్ వార్తల్లో నిలిచింది. ఉత్తర గోవాలోని అస్సాగావోలోని ఆమె రెస్టారెంట్ నడుపుతోంది.
ఇటీవల ఆమె రెస్టారెంట్ కు మద్యం లైసెన్స్ ను పునరుద్దరించారు. అయితే మరణించిన ఓ వ్యక్తి పేరుపై మద్యం లైసెన్సులను ఆమె రినివల్ చేసుకోవడం వివాదాస్పదంగా మారింది.
లైసెన్స్ పునరుద్దరణ సమయంలో మోసపూరితమైన రీతిలో తప్పుడు పత్రాలను కేంద్ర మంత్రి కూతురు సమర్పించారని ఎయిర్స్ రోడ్రిగ్స్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదు మేరకు సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్‌కు గోవా ఎక్సైజ్ కమిషనర్, నారాయణ్ ఎం. గాడ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లైసెన్స్ రినివల్ కోసం ఆంటోని గామా పేరిట దరఖాస్తు చేశారని, అతను గతేడాది మేలో మరణించినట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా లైసెన్సును గత నెలలో పునరుద్దరించారు.