పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో ఘోష్‌పుకూర్ అటవీ ప్రాంతంలో భారీ మొత్తంలో పాము విషాన్ని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషం బరువు దాదాపు 2.5 కేజీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీని విలువ సుమారు రూ.30 కోట్లు పలుకుతోందని అటవీ రేంజర్ సోనమ్ భూటియా తెలిపారు.
దీనిని ఓ క్రిస్టల్ జార్ లో భద్రపరిచారు.ఇందులో భాగంగా అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తిని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన మహ్మద్ సరాఫత్‌గా గుర్తించారు.
“అంతర్జాతీయ మార్కెట్ రేటు ప్రకారం, స్వాధీనం చేసుకున్న సరుకు విలువ సుమారు రూ. 30 కోట్లు. దీనికి సంబంధించి ఒకరిని అరెస్టు చేశాం. ఈ విషం ఫ్రాన్స్‌కు చెందినది మరియు బంగ్లాదేశ్ మీదుగా భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేయబడింది. క్రిస్టల్ కంటైనర్‌కు ఫ్రెంచ్ ట్యాగ్ ఉంది’ అని అధికారులు తెలిపారు.
ఈ విషాన్ని నేపాల్ మీదుగా చైనాకు తరలించాలన్నదే అసలు ఉద్దేశమని నిందితుడి తెలిపాడు. సరఫత్ ప్రాంతం గుండా పాము విషాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని… అతను మోటారుసైకిల్‌లో సరుకును తీసుకువెళుతున్నాడని నిషూ వర్గాల నుంచి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఉత్తర బెంగాల్‌లోని అటవీ శాఖ అధికారులు 35 రోజుల వ్యవధిలో పాము విషాన్ని స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 10న జల్పాయ్ గురి జిల్లాలో రూ.13 కోట్ల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు.