కోల్ కతా ఎయిర్ పోర్టుకు అనుకోని అతిథి వచ్చింది. విమానాశ్రయం ప్రాంగణంలో అటూ ఇటూ తిరుగుతూ హల్ చల్ చేసింది ఓ పాము. దాన్ని చూసి ప్రయాణికులంతా హడలిపోయారు.
రాయ్‌పూర్ నుంచి ముంబై వెళ్లాల్సిన విమానం కోల్‌కతా ఎయిర్ పోర్టుకు వచ్చింది. అక్కడి నుంచి ముంబైకు బయల్దేరే ముందు విమానంలో పాము కనిపించింది. లగేజ్ ఉంచే బెల్ట్ ను చుట్టుకుని ఉంది. సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.
అటవీశాఖ అధికారులు వచ్చి పామును పట్టుకొని తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.