గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల అమరావతి టూరులో ఒక స్నేక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.! అదేంటంటారా? పవన్‌కు స్నేక్స్ కూడా ఫాన్సే అనుకోండి. అంతే !
మేటరేంటంటే.. రాజధాని రైతులకు బాసటగా వుంటానని మాటిచ్చిన జన సేనాని పవన్ అమరావతిలో పర్యటించారు. రైతులకు సపోర్ట్ ఇచ్చారు. కేపిటల్ షిప్టింగ్ వద్దంటూ జగన్ సర్కారుకు క్లాస్ పీకారు. క్లారిటీ ఇచ్చి కన్ఫ్యూజన్ తొలగించాలని ప్రభుత్వ పెద్దలను డిమాండ్ చేశారు. చివరగా రాజధాని రైతులతో పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి సీరియస్‌గా మాట్లాడుతుంటే షడన్‌గా స్నేక్ వచ్చి షాక్ ఇచ్చింది..!
పవన్ మీటింగ్‌లోకి పాము ఎంటరవ్వడంతో అంతా పరుగులు పెట్టారు. సమావేశానికి వచ్చిన వారంతా హడలిపోయారు. పాము ఎలా వచ్చిందో అర్ధం కాలేదు. అదే అక్కడ హాట్ టాపిక్. కొందరయితే భయంతో పరుగో పరుగు. చివరకు పామును పట్టి బయటేశాక అంతా కామ్. స్నేక్ కూడా పవన్ ఫాన్ అయిందా అనుకుంటూ ఒకటే డిస్కషన్…!!