ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆరంభ సమయంలో ఓ ద్వీపం కీలకంగా నిలిచింది.. ఆ ద్వీపమే స్నేక్ ఐ ల్యాండ్. మొన్నటి వరకు ఆ ద్వీపం రష్యా ఆధీనంలో ఉండేది. ప్రస్తుతం ఆ ద్వీపాన్ని రష్యా దళాలు ఖాళీ చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఉక్రెయన్ దళాలు కూడా ఈ విషయాన్ని ద్రువీకరించాయి. రష్యా దళాలు ఆ ఐల్యాండ్ నుంచి వెనక్కి వెళ్లినట్లు ఉక్రెయిన్ చెప్పింది. నల్ల సముద్రంలో ఉన్న స్నేక్ ఐల్యాండ్ .. గతంలో రష్యా ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్నది.
ఈ దీవిని ఆక్రమించినవారు ఒకవేళ అక్కడ లాంగ్ రేంజ్ మిస్సైల్ వ్యవస్థను ఏర్పాట్లు చేస్తే అప్పుడు వాళ్లకు ఈ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించినట్లు అవుతుంది. అయితే రష్యాకు ఆ అవకాశం ఉన్నా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసింది.
గతంలో రొమేనియా ఆధీనంలో ఉన్న స్నేక్ ఐలాండ్‌ను సోవియేట్ యూనియన్ సమయంలో రేడార్ బేస్‌గా వాడారు. స్నేక్ ఐల్యాండ్ నుంచి దళాలను ఉపసంహరించడం అంటే తాము ఆహార ఎగుమతుల్ని అడ్డుకోవడంలేదని స్పష్టం చేసినట్లు అవుతుందని రష్యా చెప్పింది.
ఇదొకరకంగా ఉక్రెయిన్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని తరలించేందుకు ఐక్యరాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుతగలడం లేదని రష్యా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార సంక్షోభానికి తామే కారణమని చెప్పడానికి ఇప్పుడు ఉక్రెయిన్ వద్ద సమాధానం ఉండదని రష్యా తెలిపింది. ఉక్రెయిన్ మాత్రం ఇంకా నల్ల సముద్రంలోని తీర ప్రాంతాన్ని క్లియర్ చేయడం లేదని రష్యా ఆరోపిస్తోంది.