రాజమహేంద్రవరం: విలీన మండలాల ప్రజలను ఓవైపు వరదలు భయపెడుతుంటే, మరోవైపు పాములు పరిగెత్తిస్తున్నాయి. వరద ముంపులో ఉన్న గ్రామాల ప్రజలను విష సర్పాలు వెంటాడుతున్నాయి. వరదల నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు పాములు జనావాసాల్లోకి వచ్చి భయాందోళనకు గురిచేస్తున్నాయి. కూనవరం బ్రిడ్జి సమీపంలో వెళుతున్నఒక రిక్షా పైకి పాము ఎక్కే ప్రయత్నం చేసి కంగారు పెట్టింది. దీంతో ఒక్కసారిగా రిక్షా పైనుంచి దూకి పారిపోయాడు రిక్షావాలా. నెల్లిపాక దగ్గర వంతెన పైకి ఎక్కిన నల్లత్రాచును చూసిన జనం బెంబేలెత్తిపోయారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » రిక్షా ఎక్కిన కాలనాగు