వేసవి వచ్చేస్తుందంటే చాలు ఏసీలకు ఎంత గిరాకి ఉంటుందో తెలిసిందే. అప్పటికే ఏసీ ఉంటే… కూలింగ్, రిపైర్లు చకచకా చేయించేస్తుంటారు. ఏసీ ఉంటే చల్లగా ఉంటుందని పాములకు కూడా తెలిసినట్లున్నాయి. అవి కూడా ఏసీ కోసం వచ్చేస్తున్నాయి. రావటం మాత్రమే కాదు ఏకంగా ఏసీ పిల్లలను కూడా చేసేస్తే….?
అవును. నిజంగానే జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలలోని నిజంగానే జరిగింది. పవ్లీ కుర్ద్ గ్రామానికి చెందిన శ్రద్ధానంద్ అనే రైతు సోమవారం రాత్రి నిద్రపోయేందుకు బెడ్రూమ్‌లోకి వెళ్లాడు. కానీ అక్కడ ఓ నేలపై ఓ పాము పిల్లను చూసి ఆశ్చర్యపోయి దాన్ని పట్టుకొని బయట వదిలేశాడు. మళ్లీ బెడ్ రూంలోకి వెళ్లే సరికి బెడ్ పై మరో మూడు పాము పిల్లలు కనిపించాయి. దీంతో తను గందరగోళ పడి వాటిని బయట వదలిలేశాడు.
ఇక తన కళ్ల ముందే పాము పిల్లలు ఏసీ నుండి కిందపడటం గమనించిన అతను… ఏసీ తెరచి చూడగానే పాము పిల్లలు కనపించాయి. అన్ని పాములను ఒకేసారి చూసి భయపడిన శ్రద్ధానంద్ గ్రామస్తులను పిలిచాడు. వారంతా కలిసి ఆ పాము పిల్లలను భయటకు తీయగా… అందులో నుండి 40 పాము పిల్లలు భయటపడ్డాయి.
ఎక్కువ రోజుల నుండి ఏసీలు, కూలర్లు వాడకుండా ఉంటే ఇలాంటి అవకాశం అరుదుగా ఉంటాయని… పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేస్తూ ఉండాలంటూ డాక్టర్స్ సూచిస్తున్నారు.