ఈ జీవన వెలుగుల్లో మన దారెటు.. మన గమ్యం ఎక్కడ అంటూ ప్రముఖ గాయని స్నేహ సోన్కర్ హృద్యంగా పాడిన పాట మన హృదయాలను ఎక్కడికో అనంత తీరాలకు చేరుస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించిన ఈ గీతం తాలూకు వీడియో అద్భుత అనుభూతినిస్తుంది.
రితికా చక్రవర్తి, స్వప్నిల్ సోన్కర్ ఫిమేల్, మేల్ యాక్టర్లు.. బాల్యం, ఆటపాటలు, ఆ తరువాత పెద్దయ్యాక అనుభూతులు, కాలేజీ చదువుల సమయంలోమరపురాని స్మృతులు.. ఆ తరువాత మనోవేదనలు, వెతలు.. ఇవేనా మన జీవన గమ్య లక్ష్యాలు ? ఇంతకీ మనమెక్కడ ఉన్నాం ? ఈ సుదీర్ఘ యానంలో మన పయనమెటు అన్న జీవన సత్యాన్ని స్నేహ సోన్కర్ తన మధుర గళంతో పాడిన గీతాన్ని హార్మొనీ స్టూడియో రూపొందించింది.
ఆమె కంఠంలో మార్దవం, తియ్యదనం పాటకు ప్రాణం పోస్తే.. మన హృదయం అంతకన్నా అద్భుతంగా స్పందిస్తుంది. ఎవరైనా సరే! ఈ గీతాన్నివిని తీరాల్సిందే !