ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ హీరోయిన్లు అందరూ కూడా వెబ్ సిరీస్ బాట పడుతున్నారు. అయితే ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్ ,సింహా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన బ్యూటీ స్నేహా ఉల్లాల్. కొంచెం అటు ఇటుగా ఐశ్వర్యరాయ్ ను పోలి ఉండే స్నేహ ఉల్లాల్ ప్రస్తుతం సినిమాలు లేక ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ లో హాట్ హాట్ ఫోటోలతో హల్ చల్ చేస్తోంది. అయితే అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి రావట్లేదు. అటు బాలీవుడ్ లో కూడా ఆఫర్లు రాకపోవడంతో స్నేహ ఉల్లాల్ పని అయిపోయినట్టే అని అందరూ భావించారు.
ఈ టైం లో వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది స్నేహ ఉల్లాల్. ఎక్స్పైరీ డేట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శంకర్ మార్తండ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను శరత్ మరార్ నిర్మించారు. మరి ఈ వెబ్ సిరీస్ తో అయినా స్నేహ ప్రేక్షకులను మెప్పించ గలుగుతుందో లేదో చూడాలి.