నారగొని ప్రవీణ్ కుమార్, సామాజిక కార్యకర్త
ఎవరి సొమ్మని రైతు బంధు కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారు. అయినా.. రైతు బంధు అంటే రైతుకు ఇవ్వాలి. పండిన భూమికి ఇవ్వాలి. కానీ.. పండించని భూమికి ఇవ్వడమేంటి..? ఈవిధంగా ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తున్నారు.
పప్పు, బెల్లంలా డబ్బులు పంచుకుంటూ.. అప్పులు చేస్తుంటే వాటిని తీర్చేందుకు అంతిమంగా ప్రజలపైనే పన్నులు వేయాలి. లేదంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మాలి. ఓట్లు పొందటం కోసం ఇలా పథకాల కింద పైసలు పంచుకుంటూ పోతే రాష్ట్ర భవిష్యత్ ఏంటి..? మేధావులు, ప్రతిపక్షాలు నోరు విప్పాలి.
పాలక పక్షం నీచ రాజకీయం కోసం ఆ బంధు.. ఈ బంధు అని రాబందుల్లా రాజ్యం ఏలుతుంటే చూస్తూ కూర్చున్నా ద్రోహం చేసినట్లే. ఎస్టీల్లో, బీసీల్లో, అగ్రకులాల్లో కూడా కటిక పేదలు ఉన్నారు. అందుకే మేధావులు గొంతు విప్పా లి. మీడియా ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. ప్రతిపక్షాలు నిజాయితీగా మాట్లాడాలి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది.