నారగొని ప్రవీణ్ కుమార్, సామాజిక కార్యకర్త
కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానని చెప్పాడట. దళిత బంధుపై కేసీఆర్ చెబుతున్న మాటలు అలాగే ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావానికి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి కారణం 14వందల మంది అమరుల త్యాగం. అలాంటి వారి కుటుంబాల బాగోగులు మరిచి.. తన కుటుంబానికి, బంధువర్గానికి మాత్రం పదవులు కట్టబెట్టారు కేసీఆర్.
కేవలం ఓట్ల కోసం దళిత బంధు కింద రూ.10 లక్షలు ఇస్తున్నారు. దళితులకు నర్సరీ నుండి MBBS, IAS లాంటి చదువులు, అవసరమైన కార్పొరేట్ విద్య, వైద్యం ఒక్క పైసా ఖర్చు కాకుండా ఎందుకు అందించలేరు. చదువుకున్న దళిత యువతకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు. వీటిపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలి.
దళితులకు మూడు ఎకారాల భూమి ఇస్తానన్న ముచ్చటలాగే దళిత బంధు మిగిలిపోదనే నమ్మకం ఏంటి..? దళిత బంధు ఇచ్చినంత మాత్రాన దళితులందరూ బాగుపడతారా..? ఇది కేవలం ఓట్లు దండుకొవడానికి ఎత్తుగడ మాత్రమే.