అత్యధిక జనసాంద్రత గల దేశాల్లో ముందు వరుసలో ఉండే దేశం ఇండియా. అందుకే కరోనా వైరస్ భారత్‌పై ఎక్కువ ప్రభావం చూపే ఆస్కారం ఉంది. ప్రభుత్వాలు ముందే మేల్కొని, ఇతర దేశాల నుండి వచ్చే వారి విషయంలో జాగ్రత్త పడటంతో కొంత మంచి జరిగింది. అందుకే ఇటలీ, కొరియా వంటి దేశాలకు విస్తరించిన స్థాయిలో కరోనా భారత్‌లో ప్రభావం చూపలేకపోయింది.
అయితే, అతి వేగంగా వ్యాపించే గుణం ఉన్న ఈ కరోనా ఇటలీలో కేవలం రెండు వారాల్లోనే 300మంది నుండి 3వేలకు పైగా వ్యాపించగలిగింది. కొరియాలోనూ ఇదే పరిస్థితి. ఇలా భారత్‌లోనూ ఈ మహమ్మారి పాగా వేయకుండా ఉండాలంటే సోషల్ డిస్‌టెన్సింగ్ కీలకం అంటున్నారు నిపుణులు. అంటే… సమాజం నుండి వీలైనంత దూరం పాటించటం.
– అత్యవసరమైతే తప్పా దేశీయ, విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవటం. తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు.
-ఎక్కువ మంది గుమిగూడే ప్రదేశాలకు దూరంగా ఉండటం, పాఠశాలలు, జిమ్స్, మాల్స్, ఓపెన్ ఏరియా మార్కెట్లు, పబ్బులు, గుడులు, స్విమ్మింగ్ పూల్స్ మొదలైన ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
– వర్క్ ఫ్రమ్ హోం.
-ఒకవేళ ఆఫీసులు లేదా ఫ్యాక్టరీలకు వెళ్లటం తప్పనిసరి అయితే ఇతరులతో కనీసం 6 ఫీట్లు దూరంగా ఉండటంతో పాటు క్యాటీన్లు, 10మంది కన్నా ఎక్కువగా ఉండే మీటింగ్‌లకు దూరంగా ఉండటం మంచిది.
-ఇక గేమ్స్, స్పోర్ట్స్, ర్యాలీలు, క్రికెట్ మ్యాచ్‌లు వంటి వాటికి దూరంగా ఉండాలి.