న్యాయ వ్యవస్థలోనే సామాజిక న్యాయం లేదంటూ..ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో కూడా 79 శాతం అగ్రవర్ణాలకే రిజర్వు చేయడం దారుణమని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. సామాజిక న్యాయం మాత్రం అందని ద్రాక్షలానే మిగిలిపోయిందన్నారు.
న్యాయ వ్యవస్థలోనే సామాజిక న్యాయం దొరకకపోతే.. బయట ఎక్కడ దొరుకుంతుందనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత కూడా ఉన్నత న్యాయస్థానాల్లో 79 శాతం అగ్రవర్ణాలకే రిజర్వు చేయబడిందని బహుజన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. రాజ్యసభలో కూడా ఇలాగే ఉందని, అందుకే జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని బీఎస్పీ డిమాండ్ చేస్తోందని చెప్పారు.
దీంతో పాటు ఓ నేషనల్ న్యూస్ పేపర్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి ఓ ఆర్టికల్ ను ఆయన షేర్ చేశారు. కేంద్ర పార్లమెంటరీ కమిటీకి న్యాయ మంత్రిత్వ శాఖ కొన్ని కీలక గణాంకాలను వెల్లడించింది. గత ఐదేళ్లుగా అగ్రవర్ణాలకు చెందిన వారకే రిజర్వేషన్లు చేయబడుతున్నాయని, దేశంలోని 25 హైకోర్టుల్లో నియామకాల్లో 79 శాతం అగ్రవర్ణాల వారే కావడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోందని చెప్పింది.
సీట్ల నియామకాలలో 11 శాతం కంటే తక్కువున్న దేశ జనాభాలో 35 శాతం కంటే ఎక్కువున్న ఓబీసీల నియామకాలలో వివక్ష చూపిస్తోందని తెలిపింది. ఈ వివక్షకు సంబంధించిన మరో అంశమేమిటంటే..2018 నుంచి హైకోర్టులకు నియమించిన మొత్తం 537 మంది న్యాయమూర్తులలో మైనార్టీ వర్గం నుండి కేవలం 2.6 శాతం మంది మాత్రమే నియమితులవ్వడం గమనార్హం అని వెల్లడించింది. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ న్యాయవ్యవస్థల్లోనే సామాజిక న్యాయం లేకపోతే.. బయట ఎక్కడ దొరుకుతుందని ట్వీట్ చేయడం జరిగింది.