కుమార్తె వివాహాన్ని క్రైస్తవ మతాచారం ప్రకారం చేసిన భూమన కరుణాకుమార్‌రెడ్డి టీటీడీ బోర్డు మెంబరుగా ఎలా వుంటారంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేస్తోంది. దీని పైనే కొన్ని రోజులుగా బీజేపీ, హైందవ సంస్థలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు ఇదీ..
ముందుగా భూమన కరుణాకర్ రెడ్డి గారికి అభినందనలు.!
మీ అమ్మాయి భావి జీవితం మరింత ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు మీ అమ్మాయి పెళ్ళిని మీరు అవలంబించే క్రైస్తవ మత ఆచారాల ప్రకారం ఘనంగా నిర్వహించారు, చాలా సంతోషం. కాకపోతే క్రైసవ మతాన్ని అవలంబించే మీరు , హిందువుల ఆలయం అయిన తిరుమల ఆలయ పాలక మండలిలో ఎలా ఉంటారు ?? ఇది మీరు నమ్మే ఏసు ప్రభువుని మోసం చెయ్యటం కాదా ? హిందువుల ఆచారాలు మీకు తెలియవు, మీరు నమ్మే క్రైస్తవ ఆచారాలకు విరుద్దమైన విగ్రహారాధన చేసే ఆలయానికి మీరు పాలకమండలి సభ్యులుగా ఎలా ఉంటారు ?? ఏమైనా మీ అమ్మాయికి, మీకు శుభాభినందనలు, మీరు నమ్మే ఏసు ప్రభువు మీకు రక్షణ చేకూర్చుగాక ! May Jesus Bless You