సీఎం కేసీఆర్ మనుమడిపై సోషల్ మీడియా సెటైర్స్ కొత్తకాదు. సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు సచివాలయానికి రావటం, పార్టీ మీటింగ్‌ల్లో పాల్గొనటం, రాజకీయ వ్యాఖ్యలు చేయటం చూసినవే. ఓ దశలో పిల్లలతో కూడా రాజకీయమా అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డి సహా ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేశారు. కానీ ఆ పిల్లలకు ఎందుకు రాజకీయం అంటూ కేటీఆర్‌పై విమర్శలు గుప్పించిన సందర్భాలున్నాయి.
తాజాగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రపతి నుండి సీఎం కార్యాలయంలో పనిచేసే సహయ సిబ్బంది వరకు అంతా కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కొంతమందైతే సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు తమకున్న బీపీ, షుగర్‌లను లెక్కచేయకుండా గంటల తరబడి వెయిట్ చేసి మరీ కలిసొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి మరీ.
అయితే, సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో దాదాపు ప్రతి ఫోటోలోనూ కేసీఆర్ గారాల మనుమడు, కేటీఆర్ కొడుకు హిమాన్షు కనిపించాడు. ఇది యాదృచ్ఛికం కాదన్నది బహిరంగ రహస్యమే. సరే ఎదో సరదాకు ఉన్నాడనుకున్నా… హిమాన్షు బ్లాక్ డ్రెస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. హిమాన్షు వేసుకున్న టీ-షర్ట్ ఖరీదు వేలల్లో ఉందంటూ సోషల్ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి. దీనిపై రకరకాల ప్రచారం సాగుతోంది.
హిమాన్షు వేసుకున్న టీ-షర్ట్ BURBERRY బ్రాండ్‌ది. దీని ఖరీదు గురించి ఆన్‌లైన్‌లో చెక్‌చేస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. దాదాపు 350డాలర్లు… అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 22వేల పైమాటే. ఎంత సీఎం మనువడు అయితే మాత్రం అంత ఖరీదైనా జీవితమా…? టీ-షర్ట్ ఖరీదే అంత ఉంటే మిగతా డెయిలీ లైఫ్ స్టైల్ కాస్ట్ ఎంత…? అన్న ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు సీఎం కేసీఆర్ అవినీతికి ఇది నిదర్శనమని కొందరు, ఓర్వలేక విషప్రచారం అని మరికొందరు సోషల్ మీడియాలో ఫైటింగ్‌కు దిగుతున్నారు.