కేంద్ర బడ్జెట్-2023 రూపొందించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే బడ్జెట్ కు ముందు పలు రంగాల ప్రముఖులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. దీంతో కేంద్ర బడ్జెట్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు.
ఈ నేపథ్యంలో బడ్జెట్- 2023పై సోషల్ మీడియాలో భారీగా మీమ్స్, ట్రోల్స్ నడుస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌ను పిక్చర్స్ రూపంలో సూటిగా సుత్తి లేకుండా చూపిస్తూ అందర్ని ఆకట్టుకుంటున్నారు. ఈ మీమ్స్ కు చాలా మంది నెటిజన్లు లైక్స్ కొట్టే స్తున్నారు.
బడ్జెట్ పేరు చెప్పగానే మధ్య తరగతి ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయి. బడ్జెట్ నేపథ్యంలో ఏ వస్తువు ధరలు ఎంత పెరుగుతాయోనని ఆందోళన చెందుతాడు. కనీసం ఈ సారైనా పెరుగుతున్న ధరల నుంచి తమకు ఉపశమనం కలిగిస్తారా అని ఆలోచిస్తారు. అలాంటి పరిస్తితికి ఈ మీమ్ అద్దం పడుతుంది.
బడ్జెట్లో ఉపయోగించే పదాలు, భాష సామాన్యులకు అంత తేలిగ్గా అర్థం కాదు. ముఖ్యంగా పన్నుల గురించి వాడే పదాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ పదాలను తమకు అర్థమయ్యేలా చెప్పడంటూ చెబుతున్న ఈ మీమ్ తెగ వైరల్ అవుతోంది.
తాను కూడా మధ్య తరగతికి చెందిన వ్యక్తినేనని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు.ఆ నేపథ్యంలో ట్రోలర్స్ ఓ మీమ్ ను క్రియేట్ చేశారు.దానికి సంబంధించిన మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏ వస్తువైనా ఆర్డర్ చేయండి, మేము దాన్ని నిమిషాల్లోనే డెలివరీ చేస్తామంటూ జొమాటో, బ్లింకిట్ చెబుతుంటే. అదే సమయంలో ఏ వస్తువును కొనుగోలు చేసినా దానిపై జీఎస్టీ విధిస్తామంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్టుగా ఈ మీమ్ అందరినీ ఆకట్టుకుంటోంది