ఎమ్మెల్యే సీతక్క… జనం కష్టాల కోసం గన్ను పట్టినా, బ్యాలెట్ బాక్స్ యుద్ధం చేసినా… తనకు తానే సాటి. ఖరీదైన జీవితం గడుపుతూ… అనుచరులతో పనులు చేయించి, ఏసీ రూముల్లో సేదతీరే నేతలున్న ఈ రోజుల్లో… జనం కోసం ఆవిశాంత్రంగా కృషి చేస్తోన్న మహిళ ఎమ్మెల్యేకు సోషల్ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది.
మేడారం అనగానే గుర్తొచ్చేది సమ్మక-సారక్కతో పాటు జాతర కోసం వచ్చే జనసంద్రోహం. తెలంగాణ కుంభమేళగా పేరున్న మేడారం జాతర సందర్భంగా సీతక్క పనితీరు విమర్శకుల ప్రశంసలందుకుంటున్నారు. జాతర మొదలుకాక ముందే స్థానిక ఎమ్మెల్యేగా అన్ని రంగాల ప్రముఖులకు ఉదయం పూట ఆహ్వన పత్రికలు అందజేస్తూ… మద్యాహ్నం తర్వాత నియోజవకర్గం ఎమ్మెల్యేగా ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. ఈ సందర్భంలోనే తనకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ అధినేతను సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆహ్వనించారు.
ఇక జాతర మొదలైనప్పటి నుండి వీఐపీలను సమ్మక్క-సారలమ్మ వద్దకు తీసుకెళ్లి దర్శనం చేయించటమే కాదు, సామాన్య జనానికి మాస్క్‌లు పంపిణీ, మంచినీరు అందటం వంటి పనులను రాత్రనక, పగలనకా అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె గాలికి గాయమైనా… ఓ చిన్న గుడ్డతో రక్తం రాకుండా కట్టుకట్టి, మళ్లీ యాధావిధిగా మేడారం వచ్చిన జనానికి సహయం అందించారు తప్పా… ఆసుపత్రికి మాత్రం వెళ్లలేదు. షూ లేస్ ఊడిపోతేనే… నడుం వంచి కట్టుకోకుండా జనంతో కట్టించుకునే నేతలున్న ఈ రోజుల్లో ఓవైపు రక్తం రాకుండా కట్టుకట్టుకొని, చెరగని చిరునవ్వుతో ప్రజలతో సెల్ఫీలకు ఫోజులివ్వటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గన్ను పట్టుకున్న రోజుల్లో ఇలాంటి దెబ్బలు ఎన్ని చూసుండరు అని కొందరు, సీఎంతోనూ… కామన్ పీపుల్స్‌తోనూ అదే చిరునవ్వుతో ప్రజల్లో ఉన్నావ్ అక్కా అని కొందరు సోషల్ మీడియాలో సాహో అంటున్నారు.
Advertisements