విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా నాంది. వరుస పరాజయాలతో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లరినరేష్ ఈ సినిమాపై గట్టిగానే నమ్మకాలు పెట్టుకున్నాడు. తన కెరీర్ లో కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన అల్లరోడు ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అల్లరి నరేష్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శతమానంభవతి, శ్రీనివాస కళ్యాణం ఎంత మంచివాడవురా వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన సతీష్ వేగేశ్న ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కాగా లాక్ డౌన్ కు ముందే 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ ను ప్రారంభించింది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో సరిగ్గా మూడు రోజులు షూటింగ్ చేసి సడన్ గా ఆపేశారు. దీంతో సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. నాంది టీంలో కరోనా కలకలం రేగింది అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదే విషయమై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. బుధవారం వర్షం పడటం కారణంగా షూటింగ్ ఆపేశాము. దయచేసి ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయకండి అని చిత్ర యూనిట్ కోరింది. మరోవైపు వీలైనంత తొందరగా షూటింగ్ ను కంప్లీట్ చేసి ఇ పోటీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.