ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో… మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దాదాపు 5 ఏళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి కూడా ఇంకా పూర్తి కాలేదనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక రాజమౌళి కారణంగా హీరోల కెరీర్ లో సినిమాలు వాయిదా పడుతున్నాయని ఇతర దర్శకులు ఇబ్బంది పడుతున్నారనే ఆరోపణ ప్రధానంగా ఉంది.
Also Read:ఉరవకొండ ఘటనపై ప్రధాని విచారం.. ఎక్స్ గ్రేషియా ప్రకటన..!
ఇదెలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాను వచ్చే నెల విడుదల చేయడానికి సర్వం సిద్దం చేస్తున్నారు. పలు మార్లు సినిమావాయిదా పడుతూ వచ్చినా ఈసారి మాత్రం ఆలస్యం అయ్యే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కూడా ఒక రేంజ్ లో జరుగుతుంది. ఈ తరుణంలో సినిమాకు సంబంధించి ఒక పాట బాగా ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో దీనికి చాలా మంచి స్పందన వచ్చింది. నాటు కొట్టుడు అనే పాటకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ రావడం సినిమాకు బాగా ప్లస్ అవుతుంది.
అయితే ఇప్పుడు ఈ పాటకు సంబంధించి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఆఫ్రికన్ సినిమాలో ఒక పాటను ఉన్నది ఉన్నట్టు ఈ సినిమాలో షూట్ చేసారని అంటున్నారు. గతంలో ఆయన తెరకెక్కించిన ఈగ సినిమా కూడా కాక్రోచ్ అనే ఒక సినిమాకు కాపీ అనే ఆరోపణలు వచ్చాయి. బాహుబలి సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు ఇలాగే కాపీ అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనిపై ఇంకా చిత్ర యూనిట్ నుంచి స్పందన లేదు. ఏది ఎలా ఉన్నా సరే… కాపీ సీన్ లు సంగీతం విషయంలో టాలీవుడ్ లో విమర్శలు పెరుగుతున్నాయి.
Also Read:హేమా మాలిని కావడం కష్టం…