టాలీవుడ్ క్రేజీ సింగర్స్‌లో సునీత ఒకరు. సింగర్‌గా, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపు పొందారు. సునీత పాటను ఇష్టపడేవారేందరో. అయితే, సునీత మొదటి భర్త నుండి విడాకులు తీసుకుని చాలా కాలం అయ్యింది. ఈ విషయాన్ని ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేస్తూ.. తను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని, ఈ విషయంలో తనపై వస్తున్న పుకార్లను పట్టించుకోనని అన్నారు.
తను రెండో పెళ్లి చేసుకుంటుందని ఎన్నో పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. కొన్నిసార్లు ఆమె వాటిని లైట్ తీసుకోగా, కొన్నిసార్లు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయి ఖండించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ లేటెస్ట్‌గా సింగర్ సునీత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి. డిజిటల్ రంగంలో కీలక పాత్రను పోషిస్తున్న ఓ బిజినెస్‌మ్యాన్‌ను సునీత్ పెళ్లి చేసుకోబోతున్నారని, సునీత పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికి కూడా ఇది రెండో పెళ్లేనని ఆ ప్రచారం సందేశం. కానీ ఇందులోఓ ఎంత నిజముందే చూడాలి.