తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో ఒకటి మహాబూబాబాద్ జిల్లా. అక్కడ మామలు సమయంలోనే వైద్య సహాయం అందటం కష్టం. అలాంటిది లాక్ డౌన్ సమయంలో ఎంత ఇబ్బంది ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా రాత్రి పూట కర్ఫ్యూ సమయంలో… పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను చూసిన డాక్టర్ ముక్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించాడు.
తన కారులోనే స్వయంగా ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య సహాయం అందించాడు. పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండటంతో డాక్టర్ ముక్రం సేవలను జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు కొనియాడుతున్నారు.
ఇలాంటి కఠిన సమయాల్లో మీరు ఆదర్శప్రాయంగా నిలిచారు, గ్రేట్ అంటూ కలెక్టర్ ట్వీట్ చేశారు.
#CoronaWarriors #Mahabubabad
This child was born yesterday night in the remotest PHC of our district (Gangaram)in Agency area. Medical officer Dr.mukram brought the expectant mother in his own car and conducted the delivery
Such heroic stories inspire us in these tough moments pic.twitter.com/SmibxZq88d— Collector Mahabubabad (@Collector_MBD) May 13, 2020