అతనో సాఫ్ట్వేర్ ఇంజనీర్..పేరు గౌతమ్.సాఫ్ట్వేర్ ఉద్యోగంలో బాగానే సంపాదిస్తున్నాడు. అయినా ఏదో అసంతృప్తి. ఇంకేదో చేయమని తన మనసు తనకు పదే పదే చెబుతోంది.కొన్నాళ్ళకు ఏం చేయ్యాలో అతని స్పష్టమయ్యింది.
ఆ మనోస్పదనకు మరో రూపమే దేవతా మూర్తుల అలంకరణ. అవును… గుడిలోని దేవతా మూర్తులు తమని అలంకరించమని అతన్ని ఆహ్వానిస్తున్నారు. దీనికన్నా పెద్ధబాధ్యత ఏముంటుంది.
అంతకన్నా భాగ్యం ఇంకేముంటుంది. అందుకే వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసాడు. దేవతామూర్తుల అలంకరణలో నిమఘ్నమయ్యాడు. అనతికాలంలోనే అలంకరణ కళలో ఆరితేరాడు గౌతమ్.
చిన్ననాటి నుంచి అతనికి ఈ అరుదైన కళపై ఆసక్తి. నాన్నే అతని తొలిగురువు.13 ఏళ్ళ వయసులో మొదటిసారిగా అలంకరణ చేసాడు. 33 ఏళ్ళ గౌతమ్ దాదాపు 10 సంవత్సరాల క్రితం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి తరతరాలుగా వస్తున్న ఈ వృత్తిలోకి వచ్చాడు.
ఇప్పటి వరకు గౌతమ్ వేల అలంకరణలు చాసాడు. ఓపిక లేకపోతే ఈ పని చేయలేరని..తాము అలంకరిస్తున్నప్పుడు దేవుడితో మమేకం అవుతానని అంటాడు. ఈకళను మరో పదిమందికి నేర్పించాలని యాప్,వెబ్ సైట్ ను రూపొందించాడు. ఈ విద్య నేర్చుకోదలచిన వారికి శిక్షణ కూడా ఇస్తున్నాడు.
