బుల్లితెర క్రేజ్‌ను వెండితెరపై వాడుకోవాలన్న కోణంలో వచ్చిన సాఫ్ట్‌వేర్ సుధీర్ కామెడీపైనే ఆధారపడ్డాడు. కానీ జబర్ధస్త్ లెవల్ కామెడీ కూడా లేకపోవటం సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. అయితే… కథ లోపలికి వెళ్లేకొద్ది కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా సాదాసీదాగా వెళ్లిపోతుంది. అయితే ఇంటర్వెల్‌కు ముందు సెకండ్ ఆఫ్‌పై కాస్త ఏం జరుగుతుంది అన్న ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది.
సెకండ్ ఆఫ్‌లో హీరో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్, కథనం ఫుల్‌గా బోర్ కొట్టక మానదు. డైరెక్టర్ ఎం చెప్పాలనుకొని ఎం చెబుతున్నాడో అస్సలు అర్థంకాదు. సాగదీసేందుకు మాత్రం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇక క్లైమాక్స్ కాస్త ఓకే అనిపించినా అప్పటికే సినిమాపై అసహానం వస్తుంది. కామెడీ ఆశించిన వారే ఈ సినిమాకు వెళ్తారు. కానీ అక్కడ వారికి ఆ కామెడీ అస్సలు దొరకదు. ఇక నాజర్, గద్దర్ పాట ఏమాత్రం సుధీర్‌కు హెల్ప్ అవ్వలేదు. సినిమాకు కథతో పాటు డైరెక్షన్ మైనస్ అని చెప్పొచ్చు. ఇక సుధీర్ నటనపరంగా ఆకట్టుకోగా ధన్య బాలకృష్ణ నటన బాగుంటుంది. ఇంద్రజ, శియాజీ షిండే, పోసాని, తాగుబోతు రమేష్ బాగా చేసినా సినిమాకు ప్లస్ అవ్వలేకపోయారు.
రష్మిక కు ఆల్ ది బెస్ట్ చెప్పిన హృతిక్
భార్య సహకారంతో బాలికపై అత్యాచారం
ప్లస్ పాయింట్స్
సుధీర్
ధన్య బాలకృష్ణ
మైనస్ పాయింట్స్
డైరెక్షన్ సహా మిగిలిన అన్నీ.
అందంలో తనకెవ్వరు పోటీలేరంటున్న అనసూయ
Advertisements
ఆ డైరెక్టర్‌ను మర్చిపోలేనంటున్న కీర్తి సురేష్