బయట తనకు నటించడం రాదంటున్నాడు హీరో సోహెల్. తన కుటుంబాన్ని ఎవరైనా ఏమన్నా అంటే తట్టుకోలేనని, వెంటనే రియాక్ట్ అవుతానని చెబుతున్నాడు. పాపులారిటీ వచ్చిన తర్వాత అలా రియాక్ట్ అవ్వడం కూడా తప్పు అయిందని, నెగెటివిటీకే ఎక్కువ ప్రచారం వస్తోందని బాధపడ్డాడు.
“సోషల్ మీడియాలో నెగిటివిటీ ఎందుకు ఉంటుందో అర్థం కావటం లేదు. ఉదాహరణకు ఓ వెబ్ సైట్ లో నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటల్లో నా సక్సెస్ కు మా నాన్నే కారణం అని పెడితే దానికి 500 వ్యూస్ మాత్రమే వచ్చాయి. అదే ఇచ్చిపడేస్తా కొడకల్లారా అని అన్న మాటలకు లక్షా 20 వేల వ్యూస్, 700 కామెంట్స్, షేర్స్ వచ్చాయి. చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య వీడియోలకు 40 వేల వ్యూస్ వస్తే, దీనికి మాత్రం లక్షా 20 వేలున్నాయి. మన ఇంట్లోని వాళ్లను ఎవరైనా తిడితే మనం ఎలా రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అయ్యాను. అలా అవటం నాకు ప్రాబ్లెమ్ అవుతుంది. ఇక కెమెరా ముందు కూడా నటించటం ప్రాక్టీస్ చేయాలి”
ఇలా తన ఆవేదనను వెల్లగక్కాడు సోహెల్. లక్కీ లక్ష్మణ్ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన ఈ హీరో, నెగెటివిటీకి కూడా అలవాటు పడాలని, అదింకా తనకు అలవాటు కాలేదని చెబుతున్నాడు.
ప్రస్తుతం ఈ హీరో చేతిలో 4 సినిమాలున్నాయి. అతడు నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో సినిమా సెట్స్ పై ఉంది.