బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 అట్టహాసంగా ముగిసింది.మెగాస్టార్ చిరంజీవితో కలిసి హోస్ట్ నాగార్జున ఇటీవలే గ్రాండ్ ఫినాలెలో విజేతను ప్రకటించారు. అభిజత్ ఈ సీజన్‌కు విన్నర్‌గా నిలిచాడు. ఇక సీజన్ 5 కోసం నిర్వాహకులు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అయితే సీజన్ 5కి గాను హోస్ట్‌గా సోహైల్ రానున్నాడని టాక్ వినిపిస్తోంది.
సాధారణంగా బిగ్ బాస్ విన్నర్లు తదుపరి సీజన్‌లలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఈ క్రమంలో ఈసారి విన్నర్ అభిజిత్‌కు చాన్స్ రావాలి. కానీ సోహైల్‌ను ఆ అదృష్టం వరించినట్లు టాక్ వినిపిస్తోంది. అభిజత్ ఇంట్రావర్ట్ అయినందునే సోహైల్‌ను హోస్ట్‌గా ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో సోహైల్ హోస్ట్‌గా వచ్చి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేస్తాడని వార్తలు వస్తున్నాయి.
కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 వచ్చే ఏడాది.. అంటే 2021 జూన్ నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తుండగా, అందుకు గాను హోస్ట్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. అసలు తదుపరి సీజన్ గురించిన వివరాలను నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు. కానీ అప్పుడే హోస్ట్ గురించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే సీజన్ 4 లో సోహైల్ అనూహ్యంగా భారీ ఎత్తున అభిమానులను సంపాదించుకున్నాడు. అందువల్లే నిర్వాహకులు అతనికి హోస్ట్‌గా చాన్స్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. మరి అది నిజమవుతుందో, లేదో చూడాలి.