పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రాలను లైన్ లో పెట్టాడు . ప్రస్తుతం ఆ షెడ్యూల్స్ తో బిజీ బిజీ గా గడుపుతున్నాడు. అందులో రాధే శ్యామ్ రిలీజ్ కు సిద్ధంగా ఉండగా… ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్, సలార్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రెండేళ్ల క్రితం సలార్ సినిమాను ప్రకటించారు. ఏప్రిల్ 14, 2022 న రిలీజ్ డేట్ కూడా నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఇంకా చాలా వరకు పూర్తి కాలేదు. అంతేకాదు, ప్రభాస్ త్వరలో రాధే శ్యామ్ ప్రమోషన్స్తో చాలా బిజీ కానున్నాడు. మరో వైపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 ప్రమోషన్స్ తో బిజీ అవుతున్నాడు.
దీంతో సలార్ షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి మే లో ఈ సినిమా షూటింగ్ ను రిస్టార్ చేసే అవకాశం ఉందట.
ఇక ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని కొన్ని వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.