ఈ రోజుల్లో కాలుష్యం దెబ్బకు అనారోగ్య సమస్యలు ఏ విధంగా వస్తున్నాయో, జుట్టు రాలడం కూడా అలాగే జరుగుతుంది. ఇక అనారోగ్య సమస్యల ప్రభావం జుట్టుపై కూడా బలంగా పడుతుంది అనే చెప్పాలి. వాతావరణంలో ఉండే ఉండే మలిన పదార్ధాలు, ఎండ, చలి మొదలైన వాటి నుండి చర్మం రక్షణ పొందడానికి ఈ జుట్టు సహాయపడుతుంది. కాని ఇప్పుడు ఆ జుట్టుకి రక్షణ లేదు.
Also Read:అవును ఐశ్వర్యతో వైరుధ్యాలున్నాయి
ఇక వాడే షాంపూలలో ఉండే రసాయనాలు మన జుట్టుకి మరింత హాని చేస్తున్నాయి. కాబట్టి జుట్టు రాలకుండా ఉండాలి అంటే… నాలుగు విషయాలు అసలు మర్చిపోవద్దు. రోజూ ఉదయాన్నే పాలకూర ఆకులు మరియు కరివేపాకు ఆకులు సరిసమానంగా తీసుకుని మిక్సీలో వేసి జూస్ చేసి ఆ ఆకులను వడకట్టి ఆ జూస్ ను రోజూ ఉదయాన్నే తాగడం అనేది మంచిది.
అలాగే మధ్యాహ్నం ఒక గ్లాసుడు క్యారెట్ జూస్ తాగడం కూడా మన జుట్టు ఆరోగ్యానికి మంచిది. సాయంత్రం 6 గంటల సమయంలో ఉసిరి జూస్ ఒక రెండు టీ స్పూన్లు ఒక గ్లాసు నీటిలో వేసుకొని తాగితే జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చు. ప్రతీ రోజు రాత్రి పడుకునే ముందు మునగాకు పౌడర్ ను ఒక గ్లాసు మంచి నీళ్ళల్లో వేసుకుని తాగడం కూడా మంచిదే. ఇక ఊడిన వాటి స్థానంలో వయసు పెరిగే కొద్దీ కొత్త జుట్టు రావడం అనేది జరగదు. జుట్టు ఊడిన వాళ్ళ వయసు 26-28 లోపు వారైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక విటమిన్ ల లోపం అనేవి లేకుండా కూడా చూసుకోవాలి.
Also Read:ప్లీజ్… ఆ పాత్ర మీరే చేయండి సార్.!