అభివృద్ధి చూడండి.. తప్పుడు ప్రచారాలు చేయకండని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో ఆయన పర్యటించారు. బోనాల కెనాల్ లోకి సాగునీటి కోసం గోదావరి నీటిని విడుదల చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే గోదావరి నీరు చేగుంటకు రాకపోతుండే కదా.. అని ఆయన ప్రజలను ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రాజెక్టులను కడుతున్నారని.. వాళ్లు అడ్డుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. బీజేపీ.. రైతు మోటర్లకు మీటర్లు పెడతా అంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ల ద్వారా రైతుల పొలాలకి నీరు ఇస్తున్న కేసీఆర్ కావాలా.. అడ్డుకుంటున్న బీజేపీ,కాంగ్రెస్ కావాలా.. అని ఆలోచించండని మంత్రి తెలిపారు.
కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కంటి ముందు కనిపించే అభవృద్ధి చూడండి.. అని మంత్రి అన్నారు. కాకతీయ సంస్కృతి,చారిత్రక వారసత్వాన్ని భావి తరాలకు అందించేందుకు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
శనివారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4 లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో కాకతీయుల కాలం నాటి నాణేల చరిత్ర, ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రముఖ నాణేల అధ్యయన నిపుణుడు డాక్టర్ రాజిరెడ్డి రచించిన ‘కాకతీయ నాణేలు’ పుస్తకాన్ని మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు.