ప్రపంచవ్యాప్తంగా అనేక స్టాక్ ట్రేడింగ్ వెబ్‌సైట్ లకు ఇంటర్నెట్ సేవల అంతరాయం ఏర్పడింది. ఇంటర్నెట్ సేవలను ఉపయోగించే వెబ్ సైట్లలో *500 ఎర్రర్* ను చూపించింది. అనేక మంది వినియోగదారులు * 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్* ని ఎదుర్కొన్నట్లు తెలిపారు. దీని వలన స్టాక్ ట్రేడింగ్ యాప్ లైన జెరోదా, ఆప్ స్టాక్స్ లు సమస్యను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
జెరోదా ట్విటర్ లో *కొంత సమయం పాటు ఐఎస్ పీ లలోని వినియోగదారుల కోసం మేము క్లౌడ్ ఫ్లేర్ నెట్ వర్క్ ద్వారా కైట్ లో కనెక్టివిటీ సమస్యల నివేదికలు మాకు అందాయి. దాన్ని కూడా మేము క్లౌడ్ ఫ్లేర్ ద్వారా తీసుకుంటున్నామన్నారు. దాని బదులు మరో ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించాలని వినియోగదారులకు సూచించినట్లు జెరోదా తెలిపింది.
కొద్దిసేపటి తరువాత స్క్రీన్ షాట్ తో ప్రపంచ వ్యాప్తంగా అంతరాయం ఉన్నట్లు తెలిపింది. *ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాపారాలు ఉపయోగించే క్లౌడ్ ఫ్లేర్ (నెట్ వర్క్ ట్రాన్సిట్, ప్రాక్సీ, సెక్యూరిటీ ప్రొవైడర్) కూడా సేవల్లో అంతరాయం ఏర్పడింది. అందుకే మీరు మా వెబ్ సైట్, యాప్ లు ఉపయోగించుకోలేకపోతే.. మరోక ఐఎస్ పీ కి మారి ప్రయత్నించండి* అంటూ జెరోదా ట్విట్ చేసింది.