ఉక్రెయిన్, రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ప్రపంచ దేశాలన్ని ఆందోళన చెందుతున్నాయి. అయినప్పటికీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఏ మాత్రం తగ్గేదే లే.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ యుద్దంతో ప్రపంచ దేశాలన్నీ ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కానీ.. ఆ ప్రభావం పుతిన్ ఆస్తుల మీద పడదని అంటున్నారు. ఎందుకంటే ఆయనకు తరగని ఆస్తులు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
పుతిన్ సంపద ఎంతనే దానిపై క్లారిటీ లేకపోయినా.. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరని చెప్తున్నారు. 17 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పుతిన్ కు.. టెస్లా యజమాని ఎలోన్ మస్క్, యజమాని జెఫ్ బెజోస్ కంటే పుతిన్ కు ఎక్కువ ఆస్తులు ఉన్నాయని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
రష్యా రాజకీయ విశ్లేషకుడు బోరిస్ నెమ్ట్సోవ్ చెప్పిన దాని ప్రకారం.. పుతిన్ వద్ద 4 పడవలు, 43 విమానాలు, 7000 కార్లు, 15 హెలికాప్టర్లు ఉన్నాయి. న్యూస్‌వీక్ 2018 నివేదిక ప్రకారం.. పుతిన్ కారులో $ 192 మిలియన్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ లిమోసిన్ ఉందని నివేదికలు చెప్తున్నాయి.
నల్ల సముద్రం సమీపంలోని గాలెంజిక్ లో పుతిన్ కు 1 బిలియన్ విలువైన రహస్య ప్యాలెస్ కూడా ఉందపి మరో నివేదికల పేర్కొనబడింది. ప్రస్తుతం జైలులో ఉన్న ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ బృందం.. పుతిన్ ప్యాలెస్ చిత్రాలన్నీ తమ వద్ద ఉన్నాయని పేర్కొంది.
పుతిన్ జెట్ లలో ఒకదానిలో ఆయన తన కోసం బంగారు టాయిలెట్ నిర్మించబడిందని బోరిస్ నెమట్సోవ్ పేర్కొన్నాడు. 2017లో బ్రోవర్ యూఎస్ సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ముందు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడని పుతిన్ అంగీకరించారు.