కర్నాటకలోని చిత్రదుర్గ్‌లోని శ్రీ మురుగరాజేంద్ర మఠాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందర్శించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య 75వ జన్మదిన వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా మార్గ మధ్యలో మఠానికి ఆయన వెళ్లారు.
మఠంలో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. శివమూర్తి మురుగ శరణార్ స్వామిని ఆయన కలిశారు. శివమూర్తి నుంచి ఆయన లింగ దీక్ష తీసుకున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారు.
తాను గత కొంత కాలంగా బసవన్నజీ గురించి చదువుతున్నానని, ఆయన చెప్పిన విషయాలను ఫాలో అవుతున్నానని చెప్పారు. ఈ మఠాన్ని సందర్శించడం తనకు సంతోషంగా ఉందని రాహుల్ అన్నారు.
ఇష్టలింగ, శివయోగాలను తనకు సవివరంగా నేర్పేవాళ్లు కావాలని ఆయన పేర్కొన్నారు. దాని వల్ల బహుశా తనకు లాభించే అవకాశాలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు