వలస కూలీలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. వలస కార్మికులను నిర్లక్ష్యం చేయడం మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. బస్సులు, రైళ్లను తగు సంఖ్యలో ఎందుకు నడపడంలేదని ఆరోపించారు. వలస కూలీలను రాష్ట్ర సరిహద్దును ఎందుకు దాటించడం లేదన్నారు. సీఎం జగన్ సమీక్షలు చేయడంపైనే కాకుండా సమస్యలు పరిష్కరించడంపైనా దృష్టి సారించాలని సోమిరెడ్డి హితవుచెప్పారు.