జాతీయ రాజకీయాలే లక్ష్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్ కు ఆప్ పెద్ద షాకే ఇచ్చింది. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్న తెలంగాణ సీఎంకు కర్రు కాల్చి వాత పెట్టే రేంజ్ లో సంచలన ట్వీట్ చేశారు సోమ్ నాథ్ భారతి. ఈయన ప్రస్తుతం తెలంగాణ ఆప్ ఇంచార్జ్ గా ఉన్నారు. సోమ్ నాథ్ చేసిన తాజా ట్వీట్ పై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
గురువారం బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి, రాకేష్ టికాయత్ తో భేటీ అయ్యారు కేసీఆర్. ఈ భేటీల తర్వాత ప్రముఖ న్యాయ నిపుణులు ఫాలీ నారీమన్ ను కలిశారు. ఈ సమావేశాలపైనే అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు సోమ్ నాథ్ భారతి. అసలు.. ఏం జరుగుతోంది? తెలంగాణ ఆప్.. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తుందని అన్నారు.
కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేజ్రీవాల్ ను కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ.. సమావేశం జరగలేదు. దీనికి కారణాలు ఏవైనా సోమ్ నాథ్ భారతి చేసిన ట్వీట్ తో ఆప్.. కేసీఆర్ కు దూరం అనేది తేలిపోయిందని అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో ఆప్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రతీ అంశంలోనూ టార్గెట్ చేస్తూ.. కొత్త కొత్త పేర్లతో పిలుస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే.. కేసీఆర్ ఫ్రంట్ లో ఆప్ కూడా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ.. సోమ్ నాథ్ ట్వీట్ చూస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వంపై అదే దూకుడుతో ఆప్ ముందుకు వెళ్లేలా ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
కేసీఆర్ ను జైల్లో పెడతామని బండి సంజయ్ చాలా రోజుల నుంచి చెబుతున్నారు. అన్నీ రెడీ అవుతున్నాయని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుబ్రహణియన్ స్వామి, నారీమన్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. కేసులకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ చర్చించారా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఈ భేటీలపై తెగ మాట్లాడుకుంటున్నారు. రెండు రోజుల క్రితం.. ప్రముఖ లాయర్లను కూడా కేసీఆర్ కలిశారనే ప్రచారం ఉంది.
And later .@Swamy39 Ji was in my constituency to meet illustrious Jurist Sri Fali Nariman. Mr. KC Rao meeting Sri Swamy and later Sri Swamy meeting Sri Fali Nariman. What's going on? .@AAPTELANGANA has been n will continue exposing Corrupt practices of .@TelanganaCMO. https://t.co/jCa2na5vJS
— Adv. Somnath Bharti: इंसानियत से बड़ा कुछ नहीं! (@attorneybharti) March 4, 2022
Advertisements