సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలో అమలు చేస్తున్న 36 పథకాలకు కేంద్రం సాయం చేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు ప్రధాని పేరు కాకుండా జగన్ తన పేరు వేసుకుంటున్నారు. కేంద్ర నిధులతో అమలయ్యే పథకాలకు జగన్ పేరు పెట్టుకోవడం ఏంటి?
కేంద్రం నుంచి రాష్ట్రంలోని పేదలకు 15 లక్షల ఇళ్లు కేటాయించారు. వాటికి కూడా జగన్ తన పేరును తగిలించుకున్నారు. అందుకే ఆయనకు డబుల్ స్టిక్కర్, ట్రిపుల్ స్టిక్కర్ అని పేరు పెడుతున్నాం.