2024 తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ఏపీలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని అన్నారాయన. ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తోందని… చిత్తూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతోందని ఆరోపించారు. ఓ జిల్లా ఎస్పీకి స్మగ్లర్లు నెలకు రూ.5 కోట్లు ఇస్తున్నారని అన్నారు. అయినా ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శించారు.
Also Read: బీజేపీలో చేరడానికి కారణం అదే- మల్లన్న
18 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పారు సోము వీర్రాజు. బీజేపీకి పాలించే సత్తా ఉందన్న ఆయన.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రజలను కోరారు. 42 సంవత్సరాలుగా తాను ఏనాడు పదవులు ఆశించి రాజకీయం చేయలేదన్న సోము.. 2024 తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు.
Advertisements
Also Read: వర్క్ ఫ్రం హోంను చట్టం చేయనున్న కేంద్రం