ఉద్యోగులు హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రభుత్వం వారిని నిర్భంధించే చర్యలు మానుకోవాలన్నారు. ముందస్తు నోటీసులు ఇచ్చి అడ్డుకోవడం కరెక్ట్ కాదని అన్నారు వీర్రాజు. ఉద్యోగ సంఘాలను నిర్భందించడం అంటే జగన్ తనను తానే నిర్భందించుకున్నట్లని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య మాటల యుద్దం మంచిది కాదని హితవు పలికారు.
ప్రభుత్వం వద్ద డబ్బు లేదని అప్పుల కోసం తిప్పలు పడే పరిస్థితి ఉందని అన్నారు. మూల ధనం పెంచుకోవడం పై జగన్ దృష్టి సారించాలన్నారు. ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రభుత్వం వద్ద అజెండా లేదన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయం గా బీజేపీ నే చూస్తున్నారన్నారు సోము వీర్రాజు. ఇసుక ధర విషయంలో ప్రభుత్వం లెక్కలు అర్ధం కాకుండా ఉన్నాయన్నారు. ఇసుక రూపంలోనే ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అన్నారు.
వేల కోట్ల రూపాయల విలువ చేసే గనులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయని ఎర్ర చందనం అమ్మకం తో మూడు వేల కోట్ల అదాయం వస్తుందని తెలిపారు. కానీ ఇవన్నీ రాజకీయ కోణంలో దోచుకోవడమే తప్ప… ప్రభుత్వానికి చేరడం లేదన్నారు. చీమకుర్తి గనులు గతంలో ఎవరి ఆధీనంలొ ఉండేవి.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఆదాయాన్ని పెంచాలన్నారు. మోడీ నలభై లక్షల కోట్ల ఆదాయం పెంచారని తెలిపారు. 2వేల కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.
పెన్నా, కృష్ణా, గోదావరినదుల అనుంధానం వల్ల వేల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. కొండ ప్రాంతాల అభివృద్ధి పేరుతో పర్వత మాల్ పెట్టారని సాగర్ మాల్ తరహాలో.. పర్వత మాల్ రోప్ వే ఏర్పాటు చేయాలన్నారు. అనేక ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు వీర్రాజు. పార్కుల అభివృద్ధి, చిరు ధాన్యాల ఉత్పత్తి పై దృష్టి పెట్టాలన్నారు.
ప్రతి గ్రామంలో ఆహార శుద్ది పరిశ్రమ పెట్టే అవకాశం ఉందని విశాఖ, కాకినాడ లలో పెద్ద ఎత్తున పరిశ్రమ లు పెట్టాలన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని కేందం ప్రోత్సహిస్తుంది. ఈ ప్రభుత్వానికి కేంద్రం ఇరవై లక్షల ఇళ్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేశారన్నారు. పోలవరం విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
ప్రత్యేక హోదా కాదు.. స్పెషల్ ప్యాకేజీ కి చంద్రబాబు అంగీకరించారని అన్నారు. ఈ ప్యాకేజీ పై అడిగి నిధులు ఎందుకు తెచ్చుకోవడం లేదని ప్రశ్నించారు. రైల్వే జోన్ విషయంలోఏపీకి న్యాయం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ కు 930 కోట్లు పెట్టామన్నారు. కడప లో మాత్రం మూడు షుగర్ ఫ్యాక్టరీ లను జగన్ మూసివేశారని హంద్రీనీవా, గాలేరు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కడప పేరు తీసి వైఎస్ఆర్ అన్నారు… జిన్నా పేరు తీసి.. అబ్దుల్ కలాం పేరు పెడితే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. జిన్నా పేరును తొలగించాలి.. లేదంటే మేమే మారుస్తాం. అబ్దుల్ కలాం పేరు పెట్టడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గెందుకు అంటూ ప్రశ్నించారు సోము వీర్రాజు.