నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లిపై అమానుషంగా దాడి చేశాడు ఓ కసాయి కొడుకు. ఆస్తి కోసం రాక్షషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా బ్రాహ్మనందపురంలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే బ్రాహ్మనందపురంలో నాగమణిని, కొడుకు శేషు, కోడలు నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా తల్లి నాగమణిని ఆస్తి కోసం కోడలు, కొడుకు వేధిస్తూ వస్తున్నారు.
కానీ ఒక్కసారిగా శుక్రవారం వృద్ధురాలైన తల్లిని ఇంటి నుంచి గెంటివేసి విచక్షణా రహితంగా దాడి చేశాడు. వృద్యాపంలో తోడుగా దగ్గర ఉండి బాగోగులు చూసుకోవాల్సిన కన్న కొడుకే ఇలా ప్రవర్తిచటం చూసిన వారంతా కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు.
కనీసం అడ్డుకునే వారు కూడా లేకపోవడంతో ఆ తల్లి వేదన అరణ్య రోదనగా మారింది. స్థానికులు రహస్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వటంతో కొడుకు శేషును అదుపులోకి తీసుకున్నారు తాడేపల్లి పోలీసులు.