కృష్ణాజిల్లా మచిలీపట్నంలో12 సంవత్సరాల బాలుడు తల్లితండ్రులపై కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తన తల్లిదండ్రులు వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హీటరుతో తన ఒంటిపై గాయాలు చేస్తుంటే పరిగెత్తుకు వచ్చానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ బాలుడు. దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.