కొడుకు, కోడలిపై అత్తమామలు రూ. 5 కోట్లకు కోర్టులో దావా వేశారు. దావా ఎందుకు చేశారని కోర్టు వేసిన ప్రశ్నకు వారు చెప్పిన సమాధానం విని అధికారుల దిమ్మతిరిగిపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. తమ కుమారుడికి వివాహం జరిగి 6 ఏళ్లు పూర్తయ్యాయని, కానీ వారికి పిల్లలు లేరని అందుకే దావా వేశామని చెప్పడంతో అధాకారులు ఖంగుతిన్నారు.
2016లో తమ కుమారుడికి పెళ్లి చేశామని చెప్పారు. త్వరలో మనవ సంతానం వస్తుందని ఆశ పడ్డారని.. కానీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడ, మగ అనే బేధం తమకు లేదని.. ఎవరైనా పర్వాలేదనుకున్నామని వెల్లడించారు దావా వేసిన ఎస్ఆర్ ప్రసాద్.
అయితే తమ కొడుకు, కోడలు మరో ఏడాదిలోగా పిల్లలను కనాలని.. లేకుంటే పరిహారంగా చెరో రూ.2.5 కోట్లు చెల్లించాలని దంపతులు డిమాండ్ చేశారు. తన దగ్గర ఉన్న డబ్బంతా కుమారుడికి ఇచ్చానని చెప్పారు. అతడికి అమెరికాలో శిక్షణ ఇప్పించానని స్పష్టం చేశారు. ఇప్పుడు తమ దగ్గర డబ్బేమీ లేదని కోర్టుకు విన్నవించుకున్నారు.
దానికి తోడు ఇళ్లు నిర్మించుకునేందుకు బ్యాంక్‌లో రుణం తీసుకున్నామని.. ప్రస్తుతం తాము ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులో ఉన్నామని చెప్పారు ఆ దంపతులు. దీనిపై దంపతుల అడ్వకేట్ ఏకే శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ఈ కేసు సొసైటీలోని నిజాన్ని చూపిస్తోందని పేర్కొన్నారు.