డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మరోవైపు స్క్రీన్ ప్లే కూడా మోహన్ బాబు అందిస్తున్నారు.
అయితే ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ షూటింగ్ తిరుపతిలో జరిగింది. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఓ పాటను షూట్ చేశారు. తాజాగా హైదరాబాద్ లో ప్రధాన తారాగణం అంతా పాల్గొన్న పోతుంది.